Ibrahimpatnam Municipal Election: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికలో హైడ్రామా.. గెలిచిన కాసేపటికే బీఆర్ఎస్ అభ్యర్థులకు హైకోర్టు షాక్!
Ibrahimpatnam Municipal Election: ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతుంది.
Ibrahimpatnam Municipal Election: ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతుంది. బీఆర్‌ఎస్ అభ్యర్థి టేకు సుదర్శన్ రెడ్డి ఛైర్మన్‌గా.. వైస్ ఛైర్‌పర్సన్‌గా శ్యామల ఎన్నికైన కొద్ది సేపటికే హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ ఎన్నికను ఫిబ్రవరి 19 వరకు వాయిదా వేయాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని ఎవరో కిడ్నాప్ చేశారని కొడుకు హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. యాదగిరిని కోర్టులో హాజరుపర్చాలని పోలీస్‌లను ఆదేశించింది. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తరువాత ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతుంది.