Telangana: తెలంగాణలో మండుతున్న ఎండలు
Telangana: గురువారం అత్యధికంగా భద్రాచలంలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
Representational Image
Telangana: తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. గురువారం అత్యధికంగా భద్రాచలంలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో 37 డిగ్రీలకుపైగానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆదిలాబాద్‌లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రధానంగా తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. రాగల మూడురోజులు పొడివాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్‌లో ఉక్కపోత కొనసాగుతున్నది. పగటి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం 35 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.