Telangana: హైకోర్టులో తెలంగాణ కాంగ్రెస్‌కు చుక్కెదురు

Telangana: రాహుల్ ఓయూ టూర్‌ పర్మిషన్‌కు అనుమతి నిరాకరణ

Update: 2022-05-05 01:30 GMT

Telangana: హైకోర్టులో తెలంగాణ కాంగ్రెస్‌కు చుక్కెదురు

Telangana: తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్‌కు చుక్కెదురైంది. ఓయూలో రాహుల్ గాంధీ ముఖాముఖికి అనుమతిని హైకోర్టు నిరాకరించింది. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ కార్యక్రమాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యూనివర్సిటీ క్యాంపస్‌ను రాజకీయ వేదికగా వినియోగించరాదని స్పష్టం చేసింది. కాగా గతంలో సీఎం జన్మదిన వేడుకలు, బీజేపీ మాక్ అసెంబ్లీ, జార్జిరెడ్డి జయంతి జరిగాయన్న పిటిషనర్ల వాదనలపై హైకోర్టు తోసిపుచ్చింది. గతంలో అనుమతించారన్న కారణంగా రాహుల్‌ గాంధీ ముఖాముఖికి అనుమతివ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

అంతేకాకుండా ఓయూ పాలక మండలి తీర్మానానికి విరుద్ధంగా అనుమతులను జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సమానత్వ హక్కు పాజిటివ్ అంశాలకే నెగెటివ్ విషయాలకు కాదంటూ హైకోర్టు వెల్లడించింది. యూనివర్సిటీలో ఏ కార్యక్రమం సరైందో కాదో రిజిస్ట్రారే సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. ఇక ఓయూ రిజిస్ట్రార్ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. క్యాంపస్ లో రాజకీయ కార్యక్రమాలను నిషేధించేలా సమగ్ర, స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని సూచనలను చేసింది హైకోర్టు. విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండేలా యూనివర్సిటీలు చర్యలు తీసుకోవాలని హైకోర్టు అభిప్రాయపడింది. రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకుండా ఇతర యూనివర్సిటీలు కూడా మార్గదర్శకాలు రూపొందించాలని హైకోర్టు ‍ స్పష్టం చేసింది. ఇక సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పునే హైకోర్టు సమర్థించింది. విసి స్టాండింగ్ కౌన్సిల్ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ తీర్పు వెల్లడించింది. 

Full View


Tags:    

Similar News