ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలు

Warangal: ఉగ్రరూపం దాల్చిన బొగత జలపాతం

Update: 2022-07-11 07:34 GMT

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలు

Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చగ మూడు రోజులపాటు పర్యాటకులకు అనుమతి లేదని అధికారులు ప్రకటించారు. మరోవైపు సింగరేణి బొగ్గు గునుల్లోకి భారీగా వరద వచ్చి చేరడంతో సుమారు 26వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అంతరాయం ఏర్పడింది.

మరోవైపు వెంకటాపురం, వాజేడు ఏజెన్సీ ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షాలకు పంటపొలాలు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వరద ఉధృతికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక భద్రాచలం-వెంకటాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Tags:    

Similar News