Warangal: వరంగల్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. 34 కాలనీలు జలమయం

Warangal: ముంపు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్న అధికారులు

Update: 2023-07-26 05:02 GMT

Warangal: వరంగల్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. 34 కాలనీలు జలమయం  

Warangal: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో వరంగల్‌ నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను ప్రజాప్రతినిధులు,జిల్లా అధికారయంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించారు. నగరంలోని 34కిపైగా కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్‌లోని డీకేనగర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, అండర్‌ రైల్వే గేట్‌, హాంటర్‌రోడ్డు, సంతోషిమాత కాలనీలు జలమయం అయ్యాయి. 

Tags:    

Similar News