సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలేకు 15 మంది ఎంపిక

అగర్వాల్ సమాజ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏఎస్‌టీ సూపర్ సింగర్ పోటీ గ్రాండ్ ఫినాలే 2026 జనవరి 4న జరగనుంది. ఈ గ్రాండ్ ఫినాలేలో మొత్తం 15 మంది ఎంపికయ్యారు.

Update: 2025-12-24 09:48 GMT

హైదరాబాద్ : అగర్వాల్ సమాజ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏఎస్‌టీ సూపర్ సింగర్ పోటీ గ్రాండ్ ఫినాలే 2026 జనవరి 4న జరగనుంది. ఈ గ్రాండ్ ఫినాలేలో మొత్తం 15 మంది ఎంపికయ్యారు. బుధవారం నిర్వహించిన రెండో ఆడిషన్‌లో 45 సంవత్సరాలు, అంతకు పైబడిన వయస్సు గల మొత్తం 34 మంది మహిళలు, పురుషులు పాల్గొన్నారు. వీరిలో 18 నుంచి 45 సంవత్సరాల వారి నుంచి 5 మంది, 45 సంవత్సరాలకు పైబడిన వారి నుంచి 10 మందిని గ్రాండ్ ఫినాలేకు ఎంపిక చేశారు. 18 నుంచి 45 సంవత్సరాల వారిలో కనక పిట్టి, ప్రశాంత్ దేవ్ గుప్తా, రోహన్ అగర్వాల్, సందీప్ అగర్వాల్ వికాస్ అగర్వాల్ ఉన్నారు.

45 సంవత్సరాలకు పైబడిన వారిలో అమిత్ అగర్వాల్, అనూప్ అగర్వాల్, అశోక్ బన్సల్, దీపక్ అగర్వాల్, మాణిక్ లాల్ అగర్వాల్, నిధిష్ సింఘల్, శిఖా అగర్వాల్, ఉమేష్ అగర్వాల్, విశాల్ అగర్వాల్ విశ్వనాథ్ అగర్వాల్ ఎంపికయ్యారు. తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు అనిరుధ్ గుప్తా, ఉపాధ్యక్షుడు రూపేష్ అగర్వాల్, కార్యదర్శి వికాస్ కేశన్, ఖజానాదారు అంచల్ గుప్తా, సహ కార్యదర్శి డా. సీమా జైన్, నిర్వహణ కమిటీ చైర్మన్ డా. దిలీప్ పంసారి, వైస్ చైర్మన్ మహేంద్ర అగర్వాల్ తదితరులు మహారాజ్ అగ్రసేన్ జీకి పూజాలు చేసి రెండో ఆడిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సమాజ పదాధికారులు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపి, విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News