మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ: కేంద్ర కమిటీ సభ్యుడు కోయడ సాంబయ్య లొంగుబాటు
40 ఏళ్ల మావోయిస్టు జీవితం గడిపిన కేంద్ర కమిటీ సభ్యుడు కోయడ సాంబయ్య తెలంగాణ డీజీపీ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ: కేంద్ర కమిటీ సభ్యుడు కోయడ సాంబయ్య లొంగుబాటు
మావోయిస్టు ఉద్యమానికి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు 40 ఏళ్ల పాటు మావోయిస్టుగా కార్యకలాపాలు నిర్వహించిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కోయడ సాంబయ్య స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ ఎదుట ఆయన లొంగుబాటు ప్రకటించారు.
ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకే తాను స్వచ్ఛందంగా లొంగిపోయానని కోయడ సాంబయ్య అలియాస్ ఆజాద్ తెలిపారు. ఇకపై హింస మార్గం కాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
అలాగే, రెండు నుంచి మూడు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని సాంబయ్య వెల్లడించారు. ఈ ఘటనతో మావోయిస్టు శిబిరంలో కలకలం రేగుతుందని, భవిష్యత్తులో మరికొందరు కూడా లొంగుబాటు వైపు అడుగులు వేయవచ్చని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.