Nagoba Jatara 2026: ఆదివాసీల నాగోబా జాతర ప్రచార రథం ప్రారంభం
Nagoba Jatara 2026: ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతర ప్రచార రథం ప్రారంభమైంది.
Nagoba Jatara 2026: ఆదివాసీల నాగోబా జాతర ప్రచార రథం ప్రారంభం
Nagoba Jatara 2026: ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతర ప్రచార రథం ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా జాతర పుష్యమాసం రావడంతో జాతర ఉత్సవాలకు అంకురార్పణ పలికారు. జాతర ఉత్సవాల ఏర్పాట్ల కోసం నాగోబాకు ప్రత్యేక పూజల కోసం మోస్రం వంశీయులు సన్నద్ధమవుతున్నారు. నెల రోజులుగా ముందుగానే సాంప్రదాయంగా వస్తోన్న నాగోబా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు మోస్రం వంశీయులు.
ఆదిలాబాద్ జిల్లా నాగోబా దేవాలయంలో పుష్యమాసం సందడి ప్రారంభమైంది. రెండ్రోజుల క్రితం నెలవంక దర్శనంతో మోస్రం వంశీయులు నాగోబాను దర్శించుకొని జాతర ఉత్సవాల ఏర్పాట్లుకు శ్రీకారం చుట్టారు. నాగోబా జాతర ప్రచారం కోసం ఎర్పాట్లలో భాగంగా ప్రత్యేక ప్రచార వాహనం రథాన్ని ప్రారంభించారు. గ్రామదేవతకు ఆదివాసుల సాంప్రదాయ పూజలు నిర్వహించి అనంతరం జాతర ప్రారంభ రథ యాత్రను ప్రారంభించారు.
వచ్చే జనవరి 18న ప్రారంభమయ్యే కెస్లాపూర్ నాగోబా జాతర కోసం మెస్రం వంశీయులు నెల రోజుల ముందే నుండే గ్రామాల్లో ప్రచారం నిర్వహిచడం ఆనవాయితీ. ప్రచారంలో భాగంగా ఇచ్చోడ మండలం సిరికొండలో బసచేసి నాగోబా పూజల కు అవసరమయ్యే మట్టి కుండలను సేకరించనున్నారు. అయితే నాగోబా ప్రచార రథం పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించి పూజలు నిర్వహించనున్నారు.