One Rupee Funeral Rites: ఒక్క రూపాయికే దహన సంస్కారాలు

కరీంనగర్ జిల్లాలో నూతన సర్పంచ్ చారిత్రాత్మక నిర్ణయం ఒక్క రూపాయికే దహన సంస్కారాలు గ్రామ పంచాయతీ ద్వారా నిర్వహించేందుకు తీర్మానం నూతన పాలకవర్గం తొలి సమావేశంలోనే తీర్మానించిన పాలకవర్గం

Update: 2025-12-24 09:38 GMT

One Rupee Funeral Rites: ఒక్క రూపాయికే దహన సంస్కారాలు

కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామ పంచాయతీలో నూతన సర్పంచ్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే పాలకవర్గం వినూత్న తీర్మానం చేసింది. ఇకపై గ్రామంలో ఎవరైనా మరణిస్తే కేవలం ఒక్క రూపాయికే దహన సంస్కారాలు నిర్వహించేలా నిర్ణయించింది.

గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని తొలి పాలకవర్గ సమావేశంలో తీర్మానించారు. ఈ నిర్ణయం ద్వారా నిరుపేద కుటుంబాలకు భారం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

నిరుపేదలకు అండగా నిలవాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్న గ్రామ సర్పంచ్ దూలం కళ్యాణ్కు గ్రామస్తులతో పాటు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇది సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News