Telangana High Court: డీజీపీ నియామక ఉత్తర్వులు రద్దుకు నిరాకరించిన హైకోర్టు
Telangana High Court: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులు రద్దు చేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
Telangana High Court: డీజీపీ నియామక ఉత్తర్వులు రద్దుకు నిరాకరించిన హైకోర్టు
Telangana High Court: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులు రద్దు చేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. రెండు వారాల్లోగా డీజీపీల ప్యానెల్ లిస్టును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా డీజీపీ ఎంపిక ఉండాలని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ప్యానెల్ లిస్టును యూపీఎస్సీకి పంపిన తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది.