Bandi Sanjay: రెండేళ్లలో రాష్ట్ర సర్కార్ గ్రామాలకు నిధులు ఇవ్వలేదు
Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ తరుపున పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లకు సన్మానం కార్యక్రమం నిర్వహిచారు.
Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ తరుపున పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లకు సన్మానం కార్యక్రమం నిర్వహిచారు. ఈ ప్రోగ్రాంలో కేంద్రమంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు గ్రామాల్లోని ప్రజల కష్టాలు తీర్చాలని సూచించారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో గ్రామాలకు నిధులు ఇవ్వలేదన్నారు. రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కేంద్రం నుంచి వస్తాయని గుర్తు చేశారు. తన పార్లమెంట్ పరిధిలోని పంచాయతీలకు కేంద్రం నుంచి నిధులు సమకూరుస్తానని కేంద్రమంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు.