Armoor: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు నిరసనగా ఆర్మూర్‌లో వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ భారీ ధర్నా!
Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర ధర్నా నిర్వహించారు.
Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర ధర్నా నిర్వహించారు. బంగ్లాదేశ్‌లో హిందూవులపై దాడులను ఖండిస్తూ విశ్వహిందూ పరిష్‌త్, భజరంగ్ దళ్ సంయుక్త ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్.. హిందూవులపై దాడులు సిగ్గు సిగ్గు అంటూ ప్లేకార్డులతో నినాదాలు చేసారు. బంగ్లాదేశ్ ఉగ్రవాది దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీలైన హిందూవులకు రక్షణ లేదని ఆరోపించారు నేతలు, హిందువులపై దాడులు అరికట్టేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వీహెచ్‌పీ జిల్లా సంయుక్త కార్యదర్శి దయానంద్. హిందూవులంతా ఐక్యతతో పోరాటం చేయాలన్నారు.