Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. భారీగా రోడ్లపైకి వరద.. ట్రాఫిక్ జామ్

Hyderabad Rains: ఇబ్బందులు పడ్డ వాహనదారులు

Update: 2023-09-10 12:46 GMT

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. భారీగా రోడ్లపైకి వరద.. ట్రాఫిక్ జామ్

Hyderabad Rains: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, కొండాపూర్, లక్డీకాపూల్, కోఠి, సికింద్రాబాద్, బేగంపేట, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్, సరూర్‌నగర్, ఎర్రగడ్డ, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, తార్నాక, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్ పేట, అబిడ్స్, నాంపల్లితోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కుండపోత వాన పడింది. భారీ వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరడంతో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు శ్రమించారు.

Tags:    

Similar News