సూర్యాపేటలో భారీ వర్షానికి నీటమునిగిన కాలనీలు...
Heavy Rains in Suryapet: సూర్యాపేటలో భారీ వర్షానికి పలు వార్డులు, కాలనీలు నీట మునిగాయి.
సూర్యాపేటలో భారీ వర్షానికి నీటమునిగిన కాలనీలు...
Heavy Rains in Suryapet: సూర్యాపేటలో భారీ వర్షానికి పలు వార్డులు, కాలనీలు నీట మునిగాయి. నెహ్రునగర్, మానస నగర్, వెంకటేశ్వర కాలనీ, గోపాలపురం, ఆర్కే గార్డెన్స్‌లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. మరోవైపు చౌదరి చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో సమీక్ష నిర్వహించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి పరిశీలించారు. అలాగే టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.