Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

Telangana: మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ

Update: 2022-07-06 04:00 GMT

Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

Telangana: తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనంతో ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.

ఇవాళ జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. గురువారం ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. 

Tags:    

Similar News