Kadem Project: మరోసారి వణుకు పుట్టిస్తోన్న కడెం ప్రాజెక్టు.. 4 గేట్ల మొరాయింపు
Kadem Project: కడెం ప్రాజెక్టు దిగువ ఉన్న ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు
Kadem Project: మరోసారి వణుకు పుట్టిస్తోన్న కడెం ప్రాజెక్టు.. 4 గేట్ల మొరాయింపు
Kadem Project: కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్‌కు చేరింది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యానికి మించి ఇన్‌ఫ్లో వస్తుండటంతో నీరు ప్రాజెక్ట్ పై నుంచి ప్రవహిస్తోంది. కడెం ప్రాజెక్టు సామర్థ్యం మూడున్నర లక్షల క్యూసెక్కులు కాగా.. ప్రస్తుతం 3.85 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. దీంతో 12 గ్రామాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్‌కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. దీంతో 7 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.