Telangana: తెలంగాణలో హీటెక్కిన పొలిటికల్ వాతావరణం.. పోటాపోటీ సభలు, కార్యక్రమాలతో పార్టీల బిజీబిజీ
Telangana: ఒక్కో పార్టీ, ఒక్కో రకమైన ప్రోగ్రామ్‌తో రాజకీయ వేడి
Telangana: తెలంగాణలో హీటెక్కిన పొలిటికల్ వాతావరణం.. పోటాపోటీ సభలు, కార్యక్రమాలతో పార్టీల బిజీబిజీ
Telangana: తెలంగాణలో పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. ఓ వైపు కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాలు, మరో వైపు బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం ఏర్పాట్లు, అటు అధికార బీఆర్ఎస్ అభివృద్ధి పనుల శంకుస్థాపనలతో బిజీ బిజీగా ఉన్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ హైదరాబాద్ కేంద్రంగా పోటాపోటీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. ఒక్కోపార్టీ ఒక్కో రకమైన కార్యక్రమాలతో ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకు రాజకీయ వాతావరణం వేడెక్కనుంది.
ప్రారంభోత్సవాల పేరిట అధికార బీఆర్ఎస్, పార్టీ కార్యక్రమాలతో కాంగ్రెస్, విమోచనోత్సవం పేరుతో బీజేపీ వేర్వేరు ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాయి. ఇక డయాస్ ఏదైనా పొలిటికల్ స్పీచ్‌లు, స్టేట్‌మెంట్లతో ఒకరిపై మరొకరు విమర‌్శలు సంధించుకోవడానికి ఈ కార్యక్రమాలను మరింత ఉపయోగించుకోవడానికి ఆయా పార్టీల నేతలు వాడుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని పొలిటికల్ ఎటాక్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎవరు ఎలాంటి కౌంటర్ ఇస్తారనే దానిపై ఇంట్రెస్టింగ్‌గా మారింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభలో కేసీఆర్ స్పీచ్ ఏ విధంగా ఉంటుందోనన్న దానిపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్, బీజేపీలను రాజకీయంగా విమర్శించడానికి ఈ వేదికను వాడుకునే ఛాన్స్ ఉంది.
మరోవైపు వర్కింగ్ కమిటీ సమావేశాలను కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో ఇవాళ నిర్వహిస్తుంది. అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందని, ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నదని, కర్ణాటకలో గెలుపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అనుకూలంగా మారిందని భావిస్తున్న కాంగ్రెస్ ఈ సమావేశాల ద్వారా క్షేత్రస్థాయిలో బలపడాలనుకుంటోంది.
మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనంటూ బీజేపీ ఆరోపిస్తుంది. ఈ సమయంలో విమోచనా దినోత్సవాన్ని నిర్వహించి పొలిటికల్ వాతావరణాన్ని అనుకూలంగా మల్చుకోవాలని కమలనాధుల ప్లాన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా జరిపే విమోచన దినోత్సవాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే సెప్టెంబరు 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుతోంది.
ఇటు ఆయా సభల వేదికగా ఎవరికి ఎవరు ఎలాంటి సవాళ్ళు విసురుతారో.. దానికి ఏ తీరులో కౌంటర్ ఇస్తారో.. ఎవరికి ఏ రూపంలో ఎక్కువ మైలేజీ వస్తుందనే లెక్కలు మొదలయ్యాయి. ఏ సభకు ఎక్కువ మంది జనం హాజరవుతారో.. దేనికి ప్రజల నుంచి ఎక్కువ స్పందన వస్తుందో ఇలాంటి చర్చలూ జరుగుతున్నాయి.