Karimnagar: స్కూల్‌ బాత్‌రూముల్లో సీసీ కెమెరాలు.. కురిక్యాల ఘటనపై ప్రభుత్వం సీరియస్..

Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురక్యాల ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Update: 2025-10-28 06:42 GMT

Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురక్యాల ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల బాతురూంలో సీక్రెట్ కెమెరా పెట్టి విద్యార్ధినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యాకూబ్ పాషాపై ఫిర్యాదు చేసినప్పటికీ ప్రధానోపాధ్యాయుడు చర్యలు తీసుకోకపోవడంపై నిరసనలు వెల్లువెత్తడంతో అధికారులు స్పందించారు.

బీజేపీ ఆద్వర్యంలో జగిత్యాల రహదారిపై రాస్తారోకే చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంతటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయడంపై మండిపడ్డారు. పైగా విషయాన్ని బయటకు చెబితే పాఠశాలలోనే ఆత్మహత్య చేసుకుంటానని అటెండర్ యాకూబ్ భాషా బెదిరించడంతో పాఠశాల సిబ్బంది వెనక్కి తగ్గినట్టు విద్యార్ధుల తల్లిదండ్రులు చెబుతున్నారు. సఖీ కౌన్సిలింగ్ నిర్వాహకుల ద్వారా యాకూబ్ భాషా దారుణాలను కలెక్టర్ తెలుసుకున్నారు. మరో వైపు బాధిత విద్యార్ధుల వివరాలు బయటకు తెలియకుండా జాగ్రత్తలు పాటించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికారులకు సూచించారు. 

Tags:    

Similar News