Harish Rao: నాలుగేళ్ల తర్వాత కొబ్బరికాయ కొడతారట.. ప్రధాని మోడీ టూర్‌పై మంత్రి హరీష్ సెటైర్లు..
Harish Rao: కేంద్ర సర్కార్ పై హరీశ్ రావు సెటైర్
Harish Rao: నాలుగు సంవత్సరాల క్రితం మెడికల్ కాలేజీ వస్తే..ఇప్పుడు ప్రధాని మోడీ కొబ్బరికాయ కొట్టడానికి వస్తున్నారంటూ సెటైర్
Harish Rao: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది కంటి వెలుగు పథకంలో భాగంగా...కోటి మందికి వైద్య పరీక్షలు పూర్తైన సందర్భంగా.. సంగారెడ్డిలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొని కేక్ కట్ చేసారు.. కంటి వెలుగు అద్భుతమైన పథకమని.. ప్రజల నుంచి సైతం మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు.. ఇక కేంద్ర ప్రభుత్వ పని తీరుపై ఫైరయ్యారు మంత్రి హరీశ్ రావు నాలుగు సంవత్సరాల క్రితం మెడికల్ కాలేజీ వస్తే ఇప్పుడు ప్రధాని మోడీ కొబ్బరికాయ కొట్టడానికి వస్తున్నారంటూ సెటైర్ వేశారు హరీశ్.