Harish Rao: గవర్నర్ ద్వంద్వ నీతిని ప్రదర్శించారని మండిపడ్డ హరీష్‌రావు
Harish Rao: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశంలో.. ఇరుపార్టీల అవగాహన బయటపడిందన్న హరీష్‌రావు
Harish Rao: గవర్నర్ ద్వంద్వ నీతిని ప్రదర్శించారని మండిపడ్డ హరీష్‌రావు
Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రహస్యమైత్రి మరోసారి బయటపడిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్‌రావు. ట్విట్టర్ వేదికగా రెండు పార్టీలపై విమర్శలు గుప్పించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలైందని ఆరోపించారు. బీజేపీ అజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం.. కాంగ్రెస్‌కు మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ సిఫారసు చేసిన అభ్యర్థులను.. ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని గవర్నర్ నిరాకరించారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారని విమర్శించారు. ఇది ద్వంద్వ నీతి కాదా అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై.. బీఆర్‌ఎస్‌ను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నాయని హరీష్‌రావు ఆరోపించారు. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరమంటూ ట్వీట్ చేశారు మాజీ మంత్రి హరీష్‌రావు.