Harish Rao: రాజకీయ పార్టీల కుట్ర కోణాలను తుదముట్టించాలి
Harish Rao: ప్రజలే గుణపాఠం చెబుతారు
Harish Rao: రాజకీయ పార్టీల కుట్ర కోణాలను తుదముట్టించాలి
Harish Rao: తెలంగాణలో రాజకీయ పార్టీల కుట్ర కోణాలను తుదముట్టించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బీజేపీ నాయకుల వ్యవహారశైలి, మాటతీరుపై హరీశ్ రావు మండి పడ్డారు. సిద్ధిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించిన మంత్రి హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. బీజేపీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారంతో జనాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా టీఆర్ఎస్ సర్కారు సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. అమలుగాని హామీలు, ఆర్భాటపు ప్రకటనలు చేసే వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హరీశ్ రావు హెచ్చరించారు. సిద్ధిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలనుంచి టీఆర్ఎస్‌లోకి చేరిన నాయకులు, కార్యకర్తలకు హరీశ్ రావు పార్టీ కండువాలను కప్పి స్వాగతించారు.