Harish Rao: బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటితే.. చేతలు పకోడిలా ఉంటాయి
Harish Rao: ఒక్క రోజే 11,700 డబుల్ బెడ్‌రూం ఇళ్లు పంపిణీ చేశాం
Harish Rao: బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటితే.. చేతలు పకోడిలా ఉంటాయి
Harish Rao: బీజేపీ నాయకుల మాటలు ఎక్కువ... చేతలు తక్కువ అని, మాటలు కోటలు దాటుతాయి.. చేతలు పకోడిలా ఉంటాయని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని, కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడూ ధర్నాలే చేస్తాయని... పనిచేయవని ధ్వజమెత్తారాయన... సంగారెడ్డి జిల్లా కొల్లూరులో డబుల్ బెడ్‌రూములను పంపిణీ చేసిన సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. బీజేపీ నాయకులు GHMC ఎన్నికల్లో గెలిస్తే ఏది పోతే అది ఇస్తామన్నారని, బండి పోతే బండి...
గుండు పోతే గుండు.. ఇస్తామన్నారని, బండి లేదు... గుండు లేదన్నారు మంత్రి హరీశ్.. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో ఎక్కడైనా డబుల్ డబుల్ బెడ్‌రూములు ఇచ్చారా అని మంత్రి ప్రశ్నించారు. అది డబుల్ ఇంజన్ సర్కార్ కాదని, ట్రబుల్ ఇంజన్ సర్కారని మంత్రి ఎద్దేవా చేశారు. అన్ని మతాలను గౌరవించే వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారాయన.. ప్రస్తుతం 11, 700 డబుల్ బెడ్‌రూము ఇళ్లు పంపిణీ చేశామన్నారు మంత్రి హరీశ్ రావు...