Harish Rao: పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు
Harish Rao: బీజేపీకి ఓటు వేస్తే వృధా అయినట్టే
Harish Rao: పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు
Harish Rao: ప్రధాని మోడీ పాలమూరు పర్యటనపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు కౌంటర్లు వేశారు. తెలంగాణ మోడీ కొత్తగా ఇస్తున్నదేమీ లేదని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యనించారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన హరీష్‌రావు...ఇప్పటి వరకూ ట్రిబ్యునల్ ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై స్పందించిన హరీష్‌రావు.. 9 ఏళ్ళుగా గిరిజన యూనివర్సిటీకి బీజేపీ అడ్డుపడిందని ఆరోపించారు. గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని స్పష్టం చేశారు. మోడీ వచ్చినా తెలంగాణలో బీజేపీ ప్రభావం చూపదని..ఎవరెన్ని కుట్రలు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్సేనని మంత్రి హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు.