Gutha Sukender Reddy: ఎప్పటికైనా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్న గుత్తా
Gutha Sukender Reddy: కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని విమర్శించడం సరికాదన్న గుత్తా
Gutha Sukender Reddy: ఎప్పటికైనా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్న గుత్తా
Gutha Sukender Reddy: ప్రధాని మోదీ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని శాసన మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై మోదీ విషం కక్కుతున్నారని ఆయన విమర్శించారు. వార సత్వరాజకీయాలకు అంకురార్పణ చేసింది బీజేపీయేనని గుత్తాసుఖేందర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ సమర్థవంతమైన నాయకుడని, ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతారని సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అది తెలంగాణ ప్రజల ఆకాంక్షని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుఖేందర్ రెడ్డి మాట్లాడారు.