కొత్త రెవెన్యూ చట్టాల రూపకల్పనపై సర్కార్‌ కసరత్తు

Update: 2020-01-28 10:51 GMT
కొత్త రెవెన్యూ చట్టాల రూపకల్పనపై సర్కార్‌ కసరత్తు

కొత్త రెవెన్యూ చట్ట తయారీలో సీఎం కేసీఆర్‌ బిజీగా ఉన్నారు. తెలంగాణకు మంచి పరిపాలన అందించే లక్ష్యంగా పాలనలో కేసీఆర్‌ సంస్కరణలు చేపట్టారు. ప్రజలతో మమేకమై రెవెన్యూ వ్యవస్థలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నారు. అవినీతిరహిత పాలన అందించడమే లక్ష్యంగా కొత్త రెవెన్యూ చట్టానికి తెలంగాణ సర్కార్‌ రూపకల్పన చేస్తోంది.

పాలనా సంస్కరణల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ప్రయోజనాలు కాపాడే చట్టాలు మాత్రమే, అమలు చేసే దిశగా కేసీఆర్‌ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రెవెన్యూ చట్టాల రూపకల్పనపై వేగం పెంచారు. సెంటర్ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ద్వారా కొత్త చట్టాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం అధ్యయనం పూర్తి చేసింది. కొత్త చట్టాలకు ముసాయిదాలపై జిల్లా కలెక్టర్లతో సమాలోచనలు చేశారు. ఇక చట్టానికి తుదిమెరుగులు చేసే దిశగా సర్కార్‌ వేగంగా అడుగులు వేస్తోంది.

విభజన తర్వాత పాత చట్టాలతో కొన్నీంటిని అనువదించుకోవడం మరికొన్నీంటిని మార్చుకునే వీలైంది. తెలంగాణ భూ వినియోగం, రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల ఆధారంగా కొత్త చట్టాలను తీసుకువచ్చేందుకు రాష్ట్ర సర్కార్‌ కసరత్తులు ప్రారంభించింది. అయితే ఇప్పటికే పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలను అమలు చేస్తోంది. తాజాగా రెవెన్యూ చట్టం తీసుకువస్తోంది. మిగతా చట్టాలతో పోల్చితే రెవెన్యూ చట్టం కీలకమైంది. రెవెన్యూ చట్టంలో ఏ శాఖలో లేనివిధంగా దాదాపు 150కిపైగా చట్టాలున్నాయి. ఇందులో కొన్ని పూర్తిగా ఉమ్మడి రాష్ట్రంలో మాత్రమే పనికి వచ్చే చట్టాలున్నాయని అధికారవర్గాలంటున్నాయి. దీంతో 100కు పైగా చట్టాలు సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందనే నిర్ణయానికి వచ్చారు.

రెవెన్యూ చట్టం ఆధారంగా టైటిల్‌ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ చట్టాన్ని ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయకున్నా క్రమంగా అమల్లోకి తెచ్చే విధానాలపై అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని రెవెన్యూ చట్టాలన్నీంటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి రెవెన్యూ కోడ్‌ను అమలు చేయాలన్న మరో ఆలోచన కూడా ఉంది. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, బ్యాంకులు, వ్యవసాయ శాఖలన్నీంటిని ఒకేచోట పూర్తయ్యేలా చూడటం, ఒకటి, రెండు రోజుల్లోనే నిర్ణీత సేవలన్నీ రైతులకు చేరేలా చూడాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Tags:    

Similar News