Kishan Reddy: సర్కారే రియల్ ఎస్టేట్ కంపెనీ స్టార్ట్ చేసింది.. ధరణి పేరుతో పేదల భూములను లాక్కుంటున్నారు
Kishan Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనను గాలికొదిలేసింది
Kishan Reddy: సర్కారే రియల్ ఎస్టేట్ కంపెనీ స్టార్ట్ చేసింది.. ధరణి పేరుతో పేదల భూములను లాక్కుంటున్నారు
Kishan Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనను గాలికొదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించిందని విమర్శించారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి. బీఆర్‌ఎస్ పార్టీ రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిందన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ధరణి పేరుతో పేదల భూములను లాక్కుంటున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వమే దగ్గరుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయిస్తుందని ఎద్దేవా చేశారు.