Telangana: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 2.73 శాతం డి.ఎ. పెంచుతూ ఉత్తర్వులు జారీ

Telangana: 7.28 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి

Update: 2023-06-20 02:19 GMT

Telangana: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 2.73 శాతం డి.ఎ. పెంచుతూ ఉత్తర్వులు జారీ

Telangana: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక D.A. విడుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన D.A. 2022 జనవరి నుంచి వర్తించే విధంగా తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఆవిర్భావోత్సవాల సందర్భంగా జీవోను జారీ చేశామని ఆర్థిక మంత్రి హరీ‎శ్ రావు తెలిపారు. తెలంగాణలోని 7 లక్షల 28వేల మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు పెంచిన డిఎ వర్తిస్తుందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జూన్ 2023 నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2023 జూలై వేతనంతో కలిపి డి.ఎ.ను చెల్లించే విధంగా ఆర్థికశాఖకు ఆదేశాలు జారీచేశారు. కొత్తగా పెంచి డి.ఎ. ప్రభావంతో ప్రభుత్వంపై సంవత్సరానికి 974 కోట్ల 16 లక్షలు అధనపు భారం పడుతుందని ఆర్థికశాఖ అధికారులు అంచనా వేశారు.

Tags:    

Similar News