GRMB: ఇవాళ గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

GRMB: జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ పాండే ఆధ్వర్యంలో సమావేశం.. పాల్గొననున్న తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఇంజనీర్లు

Update: 2022-01-24 05:52 GMT

ఇవాళ గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం 

GRMB: గోదావరి నదీ యాజమాన్యం బోర్డు సోమవారం సమావేశం కానుంది. జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ బీపీ పాండే ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో సమావేశం జరుగుతుంది. తెలంగాణ , ఏపీ రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు సమావేశంలో పాల్గొంటారు. బోర్డు ఆదీనంలోకి ప్రాజెక్టులను తీసుకునే విషయమై సమావేశంలో చర్చిస్తారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ, దేవాదుల ఎత్తిపోతల పథకంపై చర్చించనున్నారు. ఏపీలోని సీలేరు సహా ఇతర కాంపోనెంట్ల స్వాధీనంపై చర్చిస్తారు. కృష్ణా నదీ యజమాన్య బోర్డు బృందం ఈనెల 26, 27 తేదీల్లో జూరాల, ఆర్డీఎస్, సుంకేవుల ప్రాజెక్టులను సందర్శించనుంది. ఆర్డీఎస్ నుంచి తగిన నీరు రావడం లేదని పూర్తిస్థాయిలో నీరు వచ్చేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

Tags:    

Similar News