Gandhi Jayanti 2021: తెలంగాణ అసెంబ్లీలో గాంధీ జయంతి వేడుకలు
Gandhi Jayanti 2021: మహాత్మడి విగ్రహానికి నివాళులర్పించిన స్పీకర్ పోచారం...
Gandhi Jayanti: తెలంగాణ అసెంబ్లీలో గాంధీ జయంతి వేడుకలు(ఫోటో- ది హన్స్ ఇండియా)
Gandhi Jayanti 2021: గ్రామ స్వరాజ్యం కోసం దేశం పునరంకితం కావాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్ముడి విగ్రహానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితర నేతలు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన పోచారం గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఈ ఏడేళ్లలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు.