Tirumala Package: ఉదయం 7గంటలకు బయల్దేరి..సాయంత్రం 8గంటలకు ఇంటికి..హైదరాబాద్ నుంచి ఒక్కరోజులో తిరుపతి టూర్..!!

Tirumala Package: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-06-08 02:26 GMT

Tirumala Package: ఉదయం 7గంటలకు బయల్దేరి..సాయంత్రం 8గంటలకు ఇంటికి..హైదరాబాద్ నుంచి ఒక్కరోజులో తిరుపతి టూర్..!!

Tirumala Package: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్కరోజులోనే తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వచ్చేందుకు ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం కావాలంటే రెండు రోజులు సమయం పడుతుంది. విమానంలో వెళ్తే తిరుమలకు త్వరగా చేరుకోవచ్చు. కానీ అక్కడ భక్తుల రద్దీని బట్టి దర్శనానికి పట్టే సమయంపై ఆధారపడి ఉంటుంది.

ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. క్యూ కాంప్లెక్సులు అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దర్శనానికి ఏకంగా 20గంటల సమయం పడుతుంది. అంటే భక్తులు ఏ స్థాయిలో తిరుమలకు చేరుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ సర్కార్ శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్కరోజులోనే తిరుమల వెళ్లి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యే విధంగా ఓ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది.

ఒక్కరోజులోనే తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వచ్చే విధంగా ఓ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది రాష్ట్ర పర్యాటక శాఖ. దీనిలో భాగంగా ఉదయం 7గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరుమల వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని సాయంత్రం 8గంటలకు తిరిగి ఇంటికి చేరుకునే విధంగా రూపొందించింది. అయితే ఈ టూర్ ప్యాకేజీ ధరలు భారీగానే ఉన్నాయి. ఒక్కరికి రూ. 12, 499లు చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు తెలంగాణ టూరిజం శాఖ మరో రెండు రోజుల టూర్ ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ధర రూ. 15, 499గా నిర్ణయించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం www.tourism.telangana.gob.in వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Tags:    

Similar News