Azmeera Chandulal: మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌ కన్నుమూత

Azmeera Chandulal: మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌ కన్నుమూశారు. సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

Update: 2021-04-16 01:11 GMT

మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌ (ఫైల్ ఫొటో)

Azmeera Chandulal: మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌ కన్నుమూశారు. సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చందూలాల్‌ మృతిచెందారు. కొంతకాలంగా చందూలాల్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అజ్మీరా చందూలాల్‌ స్వస్థలం ములుగు జిల్లా జగ్గన్నపేట. చందూలాల్‌కు భార్య శారద, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో గిరిజనశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన..తెలంగాణ తొలి కేబినెట్‌లో టూరిజం, సాంస్కృతికశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ములుగు జిల్లా జగ్గన్నపేటలో 17 ఆగస్టు 1954న జన్మించిన 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా గెలిచారు.

సీఎం కేసీఆర్‌ సంతాపం

మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి చందూలాల్ మరణం పార్టీకి తీరనిలోటని అన్నారు. చందూలాల్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Tags:    

Similar News