కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.నర్సారెడ్డి (93) కన్నుమూత
Narsa Reddy: సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన నర్సారెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.నర్సారెడ్డి (93) కన్నుమూత
Narsa Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.నర్సారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. నర్సారెడ్డి స్వస్థలం నిర్మల్ జిల్లా మలక్ చించోలి గ్రామంలో జన్మించారు. 1971-72లో ఉమ్మడి ఏపీ పీసీసీ అధ‌్యక్షుడిగా పని చేశారు. మాజీ సీఎం జళగం వెంగళరావు హయాంలో రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా వివిధ హోదాల్లో పనిచేశారు. నర్సారెడ్డి మృతిపై పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.