Kishan Reddy: ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు అమిత్ షా ఆదేశించారు
Kishan Reddy: నిధులు విడుదల చేయాలని తెలంగాణ కోరలేదన్నారు
Kishan Reddy: ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు అమిత్ షా ఆదేశించారు
Kishan Reddy: కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తెలుగు రాష్ట్రాల్లోని వరదల పరిస్థితిని తీసుకెళ్లారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. వరదల పరిస్థితిని అమిత్ షాకు వివరించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఏపీ, తెలంగాణకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విన్నపంపై హోంమంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు అమిత్ షా ఆదేశించారని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలకు ఎస్డీఆర్ఎఫ్ నిధులు కేటాయించినట్టు అమిత్ షా చెప్పారన్నారు. అయితే నిధులు విడుదల చేయాలని తెలంగాణ తమను కోరలేదని, తెలంగాణ అడగ్గానే అవసరమైన సహకారం అందిస్తామని అమిత్ షా చెప్పినట్టు వివరించారు కిషన్‌రెడ్డి. ఏపీ, తెలంగాణ నుంచి ప్రాథమిక నివేదిక అందాల్సి ఉందన్న కిషన్‌రెడ్డి కేంద్ర బృందాలను పంపి నష్టం అంచనా వేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.