Hyderabad: స్వప్నలోక్‌ అగ్నిప్రమాదం.. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగానే: ఫైర్ డీజీ నాగిరెడ్డి

Hyderabad: బిల్డింగ్ లోపల చిక్కుకున్న 12 మందిని రక్షించాం: డీజీ నాగిరెడ్డి

Update: 2023-03-17 06:46 GMT

Hyderabad: స్వప్నలోక్‌ అగ్నిప్రమాదం.. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగానే: ఫైర్ డీజీ నాగిరెడ్డి

Hyderabad: స్వప్నలోక్‌ ఘటనపై ఫైర్ డీజీ నాగిరెడ్డి స్పందించారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణమని భావిస్తున్నామన్నారు. స్వప్నలోక్‌ భవన యజమానులు ఫైర్‌ సేఫ్టీ నిబంధనల్లో నిర్లక్ష్యం వహించారని.. బిల్డింగ్ లోపల చిక్కుకున్న 12 మందిని రక్షించామని తెలిపారు. దురదృష్టవశాత్తు ఆరుగురు చనిపోయారన్నారు. బిల్డింగ్‌లో ఫైర్ సేఫ్టీ పని చేయడం లేదన్న ఆయన.. ఫైర్ సేఫ్టీ పెట్టుకోమని చెప్పం.. కానీ నిర్లక్ష్యం చేశారన్నారు. ఘటనలో షాపు కీపర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

Tags:    

Similar News