Sailing Week: ముగిసిన సెయిలింగ్ వీక్ పోటీలు.. వారం రోజుల పాటు జరిగిన పోటీలు

Sailing Week:

Update: 2023-07-10 02:45 GMT

Sailing Week: ముగిసిన సెయిలింగ్ వీక్ పోటీలు.. వారం రోజుల పాటు జరిగిన పోటీలు

Sailing Week: హైదరాబాద్‌ సెయిలింగ్‌ వీక్‌ పోటీలు హోరాహోరీగా సాగాయి. ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్‌కు సన్నాహకంగా జరుగుతున్నా ఈ టోర్నీ ఇవాళ ముగిసింది. నీటి అలలపై గాలి పయనం వైపు పడవలు తెరచాపలతో సాగుతూ ఔరా అనిపించాయి.

హుస్సెన్ సాగర్‌లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్ సందడి ముగింసింది. . నీటి అలలపై గాలి పయనం వైపు పడవలు తెరచాపలతో సాగుతూ ఔరా అనిపించాయి. వంద మంది సేయిలింగ్ క్రీడాకారులు 12 క్లబ్ ల నుంచి ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. గత మంగళవారం మొదలైన ఈ పోటీలు ఇవాళ్టితో ముగిశాయి. ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్, లేజర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, యాటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 37వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పేరుతో ఈ పడవ పోటీలు అత్యంత గ్రాండ్ గా నిర్వహించారు.,

హుస్సేన్ సాగర్ లో వందలాది పడవలు తెరచాపలతో రెపరెపలాడుతూ కనువిందు చేశాయి. దీంతో పెద్ద ఎత్తున వీక్షించేందుకు హుస్సేన్ సాగర్ చుట్టూ జనాలు బారులు తీరారు. లేసర్ క్లాస్, లేసర్ స్టాండర్డ్ వంటి 12 విభాగాల్లో పోటీలు జరిగాయి. ఈ ఈవెంట్ లో 11 మంది యువతులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి మొత్తం 17 మంది పాల్గొన్నారు.ముగిసిన సెయిలింగ్ వీక్ పోటీలు.. వారం రోజుల పాటు జరిగిన పోటీలు

Tags:    

Similar News