Nizamabad: నిజామాబాద్ విద్యుత్ శాఖలో డిష్యూం.. డిష్యూం..

Nizamabad: ఎస్ఈపై ఉద్యోగులు తిరుగుబాటు

Update: 2021-09-21 08:37 GMT

నిజామాబాదు ఎస్ఈ మరియు ఎంప్లాయిస్ మధ్య వాగ్వాదం (ఫోటో ది హన్స్ ఇండియా)

Nizamabad: నిజమాబాద్‌ విద్యుత్ శాఖలో అధికారి వర్సెస్ ఉద్యోగులు అన్నట్లుగా మారింది పరిస్థితి. సదరు అధికారిపై ఆ సంస్ధ ఉన్నతాధికారులకు ఉద్యోగులు ఫిర్యాదు చేస్తే.. ఆ అధికారి ఏకంగా పోలీసులను ఆశ్రయించడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో సహాయ నిరాకరణ చేస్తున్నారు ఎంప్లాయిస్. ప్రత్యక్ష ఆందోళనకు సైతం కార్యచరణ రూపొందిస్తున్నారు. యాజమాన్యం స్పందించకపోతే పెన్ డౌన్‌కు సిద్ధమంటున్నారు.

ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్ధ నిజామబాద్ సర్కిల్‌లో సూపరింటెండెంట్ ఇంజనీర్, ఉద్యోగ సంఘాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎస్.ఈ. సుదర్శనంకు ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఆయన్ను బదిలీ చేసి సస్పెండ్ చేయాలని కోరుతూ సర్కిల్ పరిధిలోని మెజార్టీ ఉద్యోగులు NPDCL.. CMDకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా సర్కిల్ కార్యాలయంలో ప్రత్యక్ష ఆందోళనలు సైతం ప్రారంభించారు.

ఎస్.ఈ. సుదర్శనం ఇచ్చే ఆదేశాలు సైతం పాటించకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారు. అధికారి క్రియేట్ చేసిన వాట్సప్ గ్రూప్ నుంచి 256 మంది ఉద్యోగులు లెప్ట్ అయ్యారు. NPDCL యాజమాన్యం ఉద్యోగుల ఫిర్యాదుపై.. విచారణ చేసి ఎస్.ఈ.ని బదిలీ చేసి.. సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నిజామాబాద్ ఎస్.ఈ.గా సుదర్శనం బాధ్యతలు చేపట్టి.. రెండున్నరేళ్లు గడిచింది. కొద్ది రోజుల పాటు ఉద్యోగులు, అధికారి సత్సంబంధాలు బాగానే ఉన్నా.. ఇటీవల విద్యుత్ శాఖలో జరిగిన బదిలీల వ్యవహారం.. ఎస్.ఈ.కి. విద్యుత్ ఉద్యోగుల జేఏసీకి మధ్య దూరం పెంచింది.

ఎస్.ఈ. వ్యవహార శైలీపై ఉద్యోగులు.. సంస్ధ సీఎండీకి ఫిర్యాదు చేయగా. ఎస్.ఈ. సుదర్శనం ఓ అడుగు ముందుకేసి.. ఐదో టౌన్ లో కొందరు ఉద్యోగ సంఘాల నేతలపై అట్రాసిటీ కేసు పెట్టారు. అయితే తనను బదిలీ చేయాలని కొందరు ఉద్యోగులు వ్యక్తిగత కక్షతో రాద్దాంతం చేస్తున్నారని ఎస్.ఈ సుదర్శనం అంటున్నారు.

ఉన్నతాధిధికారులు స్పందించకుంటే పెన్‌డౌన్‌ చేసేందుకు సైతం ఉద్యగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఎస్.ఈ, ఉద్యోగుల మధ్య పంచాయతీపై..NPDCL యాజమాన్యం స్పందంచాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News