Jammikunta: పత్తి కొనుగోళ్లపై రైతుల ఆవేదన
ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనాలంటూ జమ్మికుంటలో రైతుల డిమాండ్..
Jammikunta: పత్తి కొనుగోళ్లపై రైతుల ఆవేదన
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వ్యవసాయ మార్కెట్ యార్డుకు.. 20 నుంచి 25 వాహనాలలో రైతులు పత్తిని తీసుకొచ్చారు. CCI ద్వారా ఎకరాకు 12 క్వింటాళ్ళ పత్తి కొనుగోలు చేయాలని కోరుతున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధించిన నిబంధనలకు విరుద్ధంగా.. ప్రభుత్వం రైతుల నుంచి కేవలం 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామనడం మోసమని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసిన రైతుల కడుపు కొడుతున్నారని వాపోయారు. రైతులు తమ పంటను అమ్ముకునే పరిస్థితి లేదని.. ఇదే అదునుగా దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని.. ఎకరాకు 12 క్వింటాల పత్తిని కొనుగోలు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.