ప్రత్యూష అనుమానాస్పద మృతిపై దర్యాప్తు ముమ్మరం
Prathyusha Garimella: తాను కోరుకున్న లైఫ్ ఇది కాదంటూ సూసైడ్ నోట్
ప్రత్యూష అనుమానాస్పద మృతిపై దర్యాప్తు ముమ్మరం
Prathyusha Garimella: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒంటరితనం, డిప్రెషన్ కారణంగానే ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అత్యంత విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
బంజారాహిల్స్‌లోని తన బొటిక్‌లో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే ఆత్మహత్యపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆత్మహత్యకు ముందు ప్రత్యూష సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చార్‌కోల్ గ్రిల్‌లో కార్బన్ మోనాక్సైడ్ రసయనాన్ని ఉంచి మంటను రగిలించడం ద్వారా వచ్చే పొగను పీల్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.