Famers Protest: మెదక్ జిల్లాలో రోడ్డెక్కిన రైతులు..
Famers Protest: కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్
Famers Protest: మెదక్ జిల్లాలో రోడ్డెక్కిన రైతులు..
Famers Protest: మెదక్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వెంటనే ధాన్యాన్ని లారీల్లో మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. ప్రగతి ధర్మాసనంలో గజ్వేల్ రామాయంపేట రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై చెట్ల కొమ్మలు అడ్డుగా ఉంచి రాస్తారోకో నిర్వహిస్తూ తమ నిరసనలు తెలిపారు. మెదక్ జిల్లా రామాయం పేట మండలం ప్రగతి ధర్మారంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడక నడుస్తుందని ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు తెలిపారు.వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున వెంటనే కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీల్లో రైస్ మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేశారు.