Fake Doctors: ఆదిలాబాద్ జిల్లాలో రెచ్చిపోతున్ననకిలీ డాక్టర్లు

Fake Doctors: మెడిసన్ చదవకపోయినా డబ్బు,పలుకుబడి ఉండడంతో ఏకంగా ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నారు.

Update: 2021-03-20 16:03 GMT

Fake Doctors:(ఫైల్ ఇమేజ్)

Fake Doctors: ఆదిలాబాద్‌ జిల్లాలో కొందరు నకిలీ డాక్టర్లు రెచ్చిపోతున్నారు. డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. మెడిసిన్‌ చదవకపోయినా క్లీనిక్స్‌ నడుపుతున్నారు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఒరిజినల్‌ డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. మాయమాటలతో అందరికీ నమ్మిస్తున్నారు. అందినకాడికి ఫీజులు వసూలు చేస్తున్నారు. అవసరం లేకపోయినా మందులు కొనిపిస్తున్నారు. డబ్బు సంపాదన కోసం కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు..మెడిసన్ చదవకపోయినా డబ్బు,పలుకుబడి ఉండడంతో ఏకంగా ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించకుండా అనుమతి ఇవ్వడంతో నకిలీ వైద్యులు ఎక్కువౌతున్నారు. ఈ తతంగం ఆదిలాబాద్‌ జిల్లాలో జోరుగా సాగుతోంది... పట్టించుకోవాల్సిన అధికారులు సైలెంట్‌గా ఉండడంతో ప్రైవేట్‌ క్లీనిక్‌ల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.

రంగంలోకి వైద్యాధికారులు...

ఇటీవలే ఓ క్లీనిక్‌పై ఫిర్యాదు రావడంతో వైద్యాధికారులు రంగంలో దిగారు. నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి నడుస్తుండడంతో సీరియస్‌ అయ్యారు. ఆసుపత్రిని మూసివేయించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్‌ఓ నరేందర్ రాథోడ్‌ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నామమాత్రంగా చేయడంతో ప్రైవేట్‌ క్లినిక్‌లు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యం చేయించుకునే ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోక తప్పదని హెచ్చిరిస్తున్నారు.

Tags:    

Similar News