ఖమ్మం జిల్లా మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య మృతి

* అనారోగ్యంతో చికిత్స పొందుతూ కిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూత * మధిర నుంచి రెండు ఎమ్మెల్యేగా గెలిచిన కట్టా వెంకటనర్సయ్య * స్వస్థలం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పోచారం

Update: 2021-01-02 06:45 GMT

ఖమ్మం జిల్లా మధిర మాజీ సీపీఎం MLA కట్టా వెంకటనర్సయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మధిర శాసనసభ స్థానం నుంచి రెండుసార్లు సీపీఎం ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహించారు.

కట్టా వెంకట నర్సయ్య ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పోచారంలో జన్మించారు. 1997లో మధిర సీపీఎం శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004ఎన్నికల్లో గెలుపొంది ప్రజలకు సేవలందించారు. కమ్యూనిస్ట్ నేతగా ఎదిగిన ఆయన ఖమ్మం జిల్లాలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. విద్యార్ధి ఉద్యమాల నుంచే యుక్త వయసులోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.

పేద ప్రజల పాలిట పెన్నిధిగా కట్టా పేరు తెచ్చుకున్నారు. ‌ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన యోధుడిగా గుర్తింపు పొందారు. నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి కోసం పోరాడిన సీపీఎం అగ్రనేతల్లో ఆయన ఒకరు కట్టా మృతి పట్ల సీపీఎం సహా పలు పార్టీల నేతలు, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పేద ప్రజలకు తీరని లోటన్నారు. 

Tags:    

Similar News