Revanth Reddy: పార్టీ గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలి
Revanth Reddy: అందరికీ టికెట్ ఇవ్వలేమని నచ్చజెప్పిన రేవంత్ రెడ్డి
Revanth Reddy: పార్టీ గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలి
Revanth Reddy: కాంగ్రెస్ లో టికెట్ రాక అసంతృప్తితో రగిలిపోయిన నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఏళ్లుగా టికెట్ కోసం ఎదురుచూసిన వారు టికెట్ రాకపోవడంతో.. పార్టీ వీడుతారనే ప్రచారాలు జరుగుతున్నాయి. దీంతో అసమ్మతి నేతలు పార్టీని వీడకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. ఈ సమయంలో చీలిపోతే.. కూలిపోతామంటూ నేతలకు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పక్క పార్టీల హామీలు నమ్మి పార్టీ మారొద్దని రేవంత్ రెడ్డి సూచించారు. నియోజకవర్గం నుంచి ఆశావహులు ఎంత మంది ఉన్నా.. టికెట్ ఇచ్చేది మాత్రం ఒక్కరికేనని.. రాని వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. పార్టీ జెండా మోసిన వారిని గుండెల్లో పెట్టుకుంటామన్నారు. పార్టీ గెలుపు కోసం ప్రతీఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.