Etela Rajender: బీజేపీలో ఈటల వ్యవహారం రచ్చ రచ్చ.. షాడో ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు
Etela Rajender: అధ్యక్షుడు మార్పుకు ఈటల ఆజ్యం పోశారని ఆరోపణలు
Etela Rajender: బీజేపీలో ఈటల వ్యవహారం రచ్చ రచ్చ.. షాడో ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు
Etela Rajender: బీజేపీలో ఈటెల రాజేందర్ వ్యవహారంపై రచ్చ నడుస్తోంది. తెలంగాణ బీజేపీలో ఆయన షాడో ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్టీ ప్రెసిడెంట్ గా హైకమాండ్ నియమించింది. కిషన్ రెడ్డి నియామకం చేపట్టిన తరువాత ఈటల జిల్లాల పర్యటనలను పెంచారు. దీంతో ఈటెల రాజేందర్ తీరుపై కిషన్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోందట.
ఈటెల తీరు రాష్ట్ర పార్టీ నేతలకు తలనొప్పిగా మారడంతో పాటు పార్టీ అధ్యక్షడు కిషన్ రెడ్డికి ఆగ్రహం తెపిస్తోందని తెలుస్తోంది. తాజాగా ఈటెల తీసుకున్న నిర్ణయం కిషన్ రెడ్డితో పాటు ఆయన వర్గాన్ని ఇబ్బందికి గురిచేసిందనే చర్చ పార్టీలో జరుగుతోంది. మాజీ మంత్రి కృష్ణా యాదవ్ చేరికను పార్టీలో చర్చించకుండా ఈటెల రాజేందర్ సొంత నిర్ణయం తీసుకున్నారట. దీంతో కృష్ణ యాదవ్ చేరికకు కిషన్ రెడ్డి అడ్డుకున్నారని పార్టీ నేతలు అంటున్నారు.
ఇక పార్టీ భారీగా ఆశలు పెట్టుకొని చేరికల కమిటీ చైర్మన్ బాధ్యతలను ఈటెలకు అప్పగించింది. అయితే, పార్టీలో చెప్పుకోదగ్గ చేరికాలే లేవని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ నుండి భారీగా చేరికలు వస్తాయని ఈటెలపై అధిష్టానంతో పాటు పార్టీ నేతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయినా ఇప్పటి వరకు అధికారపార్టీ నుంచి చెప్పుకోదగ్గ నేతలెవరు కమలం గూటికి చేరలేదు. అధ్యక్షుడు మార్పుకు ఈటెల ఆద్యం పోశారని ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల పార్టీ అధ్యక్షుడిని మార్చిన తరువాత పార్టీ పరిస్థితులు మరీ అద్వనం కావడంతో ఈటెలపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.