వృక్షా బంధన్.. చెట్లకు రాఖీలు కడుతున్న పర్యావరణ ప్రియులు
Mahabubabad: చెట్లకు రాఖీలు కట్టి మంగళ హారతులతో రక్షా బంధన్ వేడుకలు
వృక్షా బంధన్.. చెట్లకు రాఖీలు కడుతున్న పర్యావరణ ప్రియులు
Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో రాఖీ పౌర్ణమి ని పురస్కరించుకొని వృక్షాలకు రాఖీలు కట్టి రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని 24వ వార్డులో చోటుచేసుకుంది. స్థానిక కౌన్సిలర్ మర్నేని. వెంకన్న, వన సంరక్షకుడు ధైద వెంకన్నల ఆధ్వర్యంలో ఇందిరానగర్ కాలనీ వాసులు హిందూ సాంప్రదాయం ప్రకారం వృక్షాలకు పసుపు ,కుంకుమలు పెట్టారు. అనంతరం రాఖీలు కట్టి మంగళ హారతులు ఇచ్చి రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రాఖీ పౌర్ణమి రోజు వృక్షాలకు రాఖీలు కడుతూ ఇదే విధంగా రక్షాబంధన్ వేడుకలు జరుపుకుంటున్నారు. వృక్షో రక్షతి రక్షిత అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలన్నారు. వృక్షాలు లేకపోతే మానవ మనుగడకే ప్రమాదమని అన్నారు.