Public Holiday: న్యూ ఇయర్ డే వర్కింగ్ డేనే! ఏపీ.. తెలంగాణలో ఆప్షనల్ హాలిడే మాత్రమే.!!
Public Holiday: న్యూ ఇయర్ డే వర్కింగ్ డేనే! ఏపీ.. తెలంగాణలో ఆప్షనల్ హాలిడే మాత్రమే.!!
Public Holiday: న్యూ ఇయర్ వచ్చేస్తోంది.. కానీ ఈసారి జనవరి 1న తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే లేదు. సాధారణంగా కొత్త సంవత్సరం రోజున సెలవు ఉంటుంది అనుకుంటారు. కానీ 2025 జనవరి 1కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అధికారిక పబ్లిక్ హాలిడే ప్రకటించలేదు. రెండు రాష్ట్రాల్లోనూ ఇది కేవలం ఆప్షనల్ హాలిడేగా మాత్రమే ఉంది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, బ్యాంకులు సాధారణ రోజుల్లోలాగే పనిచేయనున్నాయి.
ప్రభుత్వ సెలవు లేకపోయినా.. చాలా ప్రైవేట్ స్కూళ్లు మాత్రం విద్యార్థులకు రేపు సెలవు ప్రకటించాయి. న్యూ ఇయర్ వేడుకలు, కుటుంబ కార్యక్రమాల నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే ఈ సెలవుకు బదులుగా ఫిబ్రవరి నెలలో రెండో శనివారం పాఠశాలలు పనిచేస్తాయని కూడా స్పష్టత ఇచ్చాయి. వార్షిక పని దినాల సంఖ్య తగ్గకుండా ఉండేందుకు ఈ విధమైన సర్దుబాటు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు జనవరి 1న ఎలాంటి సెలవు లేదు. అన్ని బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్, ఇతర బ్యాంకింగ్ సేవలు సాధారణంగానే కొనసాగుతాయని బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో కొత్త సంవత్సరం రోజు బ్యాంకు పనులు చేయాలనుకునే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ఉన్నప్పటికీ, అత్యవసర పనుల కోసం చాలా మంది విధులకు హాజరయ్యే అవకాశముంది. సెలవు తీసుకునే వారు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి.. న్యూ ఇయర్ అయినప్పటికీ ఈసారి జనవరి 1 సాధారణ పని దినంలాగే గడవనుంది. అయితే ప్రైవేట్ స్కూళ్లలో మాత్రం విద్యార్థులకు సెలవు రావడంతో కొంతమేర న్యూ ఇయర్ ఫీలింగ్ కనిపించనుంది.