Telangana Elections: తెలంగాణలో మొదలైన ఎన్నికల హడావుడి
Telangana Elections: ఓటర్ల జాబితా,ఎన్నికల ఏర్పాట్లు, నిఘాపై ఆరా తీయనున్న అధికారులు
Telangana Elections: తెలంగాణలో మొదలైన ఎన్నికల హడావుడి
Telangana Elections: తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో.. కసరత్తు మొదలుపెట్టింది ఎన్నికల కమిషన్. ఈ నేపథ్యంలో తెలంగాణలో మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తోంది ఈసీఐ. ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌కు ECI బృందంలోని ఇద్దరు సభ్యులు చేరుకున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకి రాజకీయ పార్టీలతో భేటీ కానున్నారు అధికారులు. సాయంత్రం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సమావేశం అవుతారు.
సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి CEO, CAPF, SPNO నోడల్ అధికారులు.. ECI బృందానికి ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఇక ఎల్లుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు.. సీపీలతో సమావేశం అవుతారు ఎన్నికల కమిషన్ అధికారులు. అక్టోబర్ 5న ఉదయం 9.15 కి ఓటర్లతో.. ఉదయం 11 గంటలకు సీఎస్, డీజీపీతో సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లు, నిఘాపై ఆరా తీయనున్నారు.