తెలుగు రాష్ట్రాల్లో మొదలైన దసరా సందడి, రద్దీగా హైదరాబాద్ బస్టాండ్లు...

Dussehra 2021: *దసరా పండుగకు మొత్తం 4032 ప్రత్యేక బస్సులు *అదనపు ఛార్జీలు ఉండవన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Update: 2021-10-12 04:26 GMT

తెలుగు రాష్ట్రాల్లో మొదలైన దసరా సందడి, రద్దీగా హైదరాబాద్ బస్టాండ్లు...

Dussehra 2021: తెలంగాణలో దసరా సందడి మొదలైంది. పండుగ సందర్భంగా నగరంలో బస్టాండ్‌లు రద్దీగా మారాయి. ప్రయాణికులను తరలించడానికి టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మరోవైపు వివిధ ప్రాంతాలకు నడుపుతున్న ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల వసూలును ఆర్టీసీ విరమించుకుంది. పండుగకి రెండు రోజులే సమయం ఉండడంతో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణలో దసరా పండగ కోసం ప్రయాణికులను తరలించడానికి ఆర్టీసీ 4035 అదనపు బస్సులు నడుపుతోంది. రోజుకు 4 కోట్ల అదనపు ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 5 రోజుల్లో ఆర్టీసీ ద్వారా కోటి 30 లక్షల మంది ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరారు. ముందుగా ప్రత్యేక బస్సుల్లో అదనంగా 50 శాతం చార్జీలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎండి సజ్జనార్ నిర్ణయంతో ఆర్టీసీ వెనక్కి తగ్గింది. ఎక్కడికి వెళ్లినా సాధారణ చార్జీలు మాత్రమే వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు.

పండగకు 3 రోజులు మాత్రమే ఉండడంతో నగరంలోని ప్రధాన బస్‌స్టాండ్‌లు ప్రయాణికులతో రద్దీగా మారింది. ఉత్తర తెలంగాణ వైపు వెళ్లే బస్సులు JBS, దక్షిణ తెలంగాణ వైపు వెళ్లే బస్సులు MGBS నుండి నడుస్తున్నాయి. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల నుండి కూడా అదనంగా బస్సులు వెళ్తున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వచ్చే 3 రోజులు తగిన విధంగా బస్సులు ఆపరేట్ చేస్తామని స్పెషల్ ఆపరేషన్ అధికారులు చెబుతున్నారు.

ఆర్టీసీ అదనపు ఛార్జీలు తగ్గించడంతో ప్రయాణికులపై భారం తగ్గనుంది. మరోవైపు పండగకి ఇంకా సమయం ఉండడంతో వచ్చే 3 రోజులు కూడా ఆర్టీసీ తమ టార్గెట్‌ని రీచ్ అయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News