Droupadi Murmu: ఇవాళ సాయంత్రం ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi Murmu: సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ముర్ము బయలుదేరుతారు
Droupadi Murmu: ఇవాళ సాయంత్రం ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi Murmu: ఇవాళ సాయంత్రం ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ముర్ము బయలుదేరుతారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్‌కి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో స్ఫూర్తి కేంద్రం 3వ నంబర్ గేట్ వద్ద త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతారు. సాయంత్రం శంషాబాద్‌లోని శ్రీరామ్‌నగర్‌లో శ్రీరామానుజాచార్య విగ్రహాన్ని సందర్శిస్తారు. తర్వాత 108 ఉపాలయాలు సందర్శిస్తారు. ఆ తర్వాత రామానుజ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీని సందర్శిస్తారు. అక్కడి నుంచి రామానుజన్ స్వర్ణ విగ్రహాన్ని దర్శనం చేసుకుంటారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. త్రిదండి చినజీయర్ స్వామి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళ శాసనాలు ఇస్తారు. అనంతరం డైనమిక్ ఫౌంటెయిన్ షో తిలకిస్తారు రాష్ట్రపతి. ఆ తర్వాత స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ త్రీడీ లేజర్ షో చూసిన తరువాత సందర్శకులను, భక్తులను, దేశ ప్రజలనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతారు. రాత్రి 7 గంటల వరకు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలోనే ఉండనున్నారు రాష్ట్రపతి.