నేడు హైదరాబాద్‌కు 80 దేశాల రాయబారులు..

కోవిడ్ వ్యాక్సిన్‌ కోసం అంతా ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ.. దేశీయంగా తయారవుతోన్న వ్యాక్సిన్లపై అందరి ఫోకస్ పడింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇవాళ జరగనున్న విదేశీ రాయబారుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో

Update: 2020-12-09 01:00 GMT

కోవిడ్ వ్యాక్సిన్‌ కోసం అంతా ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ.. దేశీయంగా తయారవుతోన్న వ్యాక్సిన్లపై అందరి ఫోకస్ పడింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇవాళ జరగనున్న విదేశీ రాయబారుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో కోవిడ్ పై జరుగుతున్న పరిశోధనలను విదేశీయులకు పరిచయం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్శనకు 80 దేశాలకు చెందిన రాయబారులు, హైకమిషనర్లతో కూడిన బృందం రానుంది. ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటలకు హైదరాబాద్ కి చేరుకోనున్న ఈ బృందం.. నేరుగా భారత్ బయోటెక్‌కి వెళ్లి అక్కడ కోవ్యాగ్జిన్‌ ప్రయోగాలు, వాటి ఫలితాలను తెలుసుకోనున్నారు. 

Tags:    

Similar News