Secunderabad: సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద స్థానికుల ధర్నా
Secunderabad: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి స్థలం ఇచ్చిన తమకే ఇండ్లను కేటాయించాలి
Secunderabad: సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద స్థానికుల ధర్నా
Secunderabad: సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద స్థానికులు ధర్నా నిర్వహించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న , మంత్రి తలసానిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే సాయన్న తమ ఇళ్ల స్థలాలను తీసుకొని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను నిర్మించారని స్థానికులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని మంత్రి తలసాని దగ్గరికి వెళ్తే..డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అర్హులను దొంగలు అని తిట్టి పంపించడంతో స్థానికులు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.